Udyogini Scheme: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండా రూ. 3 లక్షల వరకు ఋణం ఇచ్చే ఉద్యోగిని పథకం గురించి తెలియజేస్తాము. ఈ పథకం ద్వారా ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటారో లేదు వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 0% వడ్డీతో ఋణం ఇస్తుంది. కానీ ఇది అందరికి 0% వడ్డీ కాదు. ఈ ఋణం 0% వడ్డీతో పొందడానికి మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
Advertisement

Table of Contents
- 0% వడ్డీతో ఋణం తీసుకోవడానికి అర్హులు ఎవరు?
- 50% సబ్సిడీ ఎలా పొందాలి?
- ఉద్యోగిని ఋణం కోసం ఎలా దరఖాస్తు చెయ్యాలి?
0% వడ్డీతో ఋణం తీసుకోవడానికి అర్హులు ఎవరు?
మీరు ఇక్కడ క్రింద చెప్పిన అర్హతలు కలిగి ఉంటె మీరు 0% వడ్డీతో ఋణం పొందే అవకాశం ఉంది.
Advertisement
- ఈ పథకం భారత మహిళల కోసం మాత్రమే.
- కొత్తగా వ్యాపారం చేసే మహిళలు లేదా అంతకుముందే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇస్తారు.
- ఇంతక ముందు లోన్ ఏమైనా తీసుకొని ఉంటె, అవి సమయానికి చెల్లించిన వారుగా ఉండాలి.
0% వడ్డీ | 10% నుండి 15% వడ్డీ |
---|---|
SC/ST మహిళలకు మరియు వికలాంగులకు 0% వడ్డీ రేటుతో ఋణం ఇస్తారు. | సాధారణ మహిళలకు మాత్రం 10 నుండి 15% వడ్డీ ఉంటుంది. |
ఎటువంటి హామీ అవసరం లేదు. | ఇటివంటి హామీ అవసరం లేదు. |
50% సబ్సిడీ ఎలా పొందాలి?
ఉద్యోగిని పథకం ద్వారా మీరు 30 నుండి 50% వరకు సబ్సిడీ పొందవచ్చు. ఉదాహరణకు మీరు 50% సబ్సిడీ కి అర్హులు అయితే. మీరు రూ. 3 లక్షలు ఋణం తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు అందులో 50% సబ్సిడీ అంటే రూ. 1.5 లక్షల కేంద్ర ప్రభుత్వం చెల్లింస్తుంది. మీరు మిగిలిన 1.5 లక్షల రూపాయలను తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
30% సబ్సిడీ: వితంతువులు మరియు వికలాంగులకు 30% వరకు సబ్సిడీ ఉంటుంది.
50% సబ్సిడీ: SC/ST మరియు ట్రైబల్ మహిళలకు 50% సబ్సిడీ తో ఋణం పొందుతారు.
మీరు ఈ రుణాన్ని తిరిగి 7 సంవత్సరాల కాల వ్యవధిలో చెల్లించాలి.
Also read: Free Bus: వీరికి కూడా APSRTC ఉచిత బస్సు ప్రయాణం
ఉద్యోగిని ఋణం కోసం ఎలా దరఖాస్తు చెయ్యాలి?
ఉద్యోగిని లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది ఇచ్చిన దశలను అనుసరించాలి. అలాగే మీరు ఈ ఉద్యోగిన పథకం ద్వారా ఋణం పొందడానికి మీరు EDP (Entrepreneurship Development Programme) ట్రేనింగ్ తీసుకొని ఉండాలి. ఈ ట్రైనింగ్ మీకు 3 నుండి 6 రోజులు ఉంటుంది.
- మీరు ఈ ట్రేనింగ్ తీసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్న బ్యాంకు కు వెళ్లి ఈ లోన్ కి అప్లికేషన్ పెట్టొచ్చు.
- మీ ఆధార వివరాలు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు వారికి ఇవ్వవలసి ఉంటుంది.
- మీరు బ్యాంకుకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచు.
Advertisement