Talliki Vandanam: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు నేను తల్లికి వందనం పథకం గురించి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన కీలక ప్రకటన పైన సమాచారం తెలియజేస్తాను. ప్రకటనలో, సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారిన తల్లికి వందనం పథకం గురించి ఇచ్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న, “తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు”, “తల్లికి వందనం పథకానికి కావాల్సిన పత్రాలు ఇవే” మరియు ఇలా చక్కర్లు కొడుతున్నవి అన్ని అవాస్తవాలు అని కూటమి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది.
Advertisement

తల్లికి వందనం పథకానికి సంబందించి ఇంకా మార్గదర్శకాలు పూర్తిగా తాయారు అవ్వలేదని… చెప్పుకొచ్చారు. అలాగే “తల్లికి వందనం పథకం అర్హత ఉండాలి అంటే 75% అటెండన్స్ ఉండాలి” అని సోషల్ మీడియాలో వచ్చేవి అన్ని అవాస్తవాలు అని చెప్పారు.
Advertisement
ఎన్నికలకు ముంది తల్లికి వందనం పథకం క్రింద చదువుకునే ప్రతి పిల్లవానికి రూ.15 వేల రూపాయల చొప్పున ప్రతి బిడ్డకి ఇస్తానని కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టో లో చెప్పింది. ఇప్పటి వరకు తల్లికి వందనం గురించి అధికారక సమాచారం రాకపోయేసరికి, చాల రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
వాట్సాప్, టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో “తలికి వందనం యొక్క కొత్త అర్హత సమాచారం” అని ఇలాంటి మెసేజ్లు ఎన్నో చూసి ఉంటారు. కానీ అవన్నీ నిజాలు కాదు, అధికారికంగా ఇంకా ప్రభుత్వం తరుపు నుండి ఎటువండి సమాచారం ఇవ్వలేదని, తప్పుడు వార్తలు నమ్మవద్దు అని ఆంధ్రప్రదేశ్ లోని అందరి తల్లులు ఇది గమనించాలని వివరించి చెప్పారు.
Advertisement