Standup Mitra: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా భారతదేశంలోని మహిళలకు వచ్చే లోన్ గురించి తెలియజేస్తాము. మహిళలను తమ సొంత కాళ్ళ పైన నిలబడేలా, వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి లేదా ఉన్నవ్యాపారాన్ని విస్తరింపచేయదానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దాదాపు రూ. 10 లక్షల నుండి 1 కోటి రూపాయలు వరకు పొందవచ్చు.
Advertisement
Table of Contents
- ఈ పథకం ఎప్పడ మొదలు పెట్టారు?
- స్టాండప్ ఇండియా పథకం ప్రయోజనాలు
- ఈ పథకానికి అర్హులు ఎవరు?
- Standup India పథకానికి ఎలా దరఖాస్తు చెయ్యాలి?
ఈ పథకం ఎప్పడ మొదలు పెట్టారు?
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం మహిళలను బలపరచడానికి అమలు చేసారు. ఇది 15 ఆగష్టు 2015 లో కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు ఈ పథకానికి 2 లక్షల 60 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో దాదాపుగా 2 లక్షల 40 వేల మందికి పైగా ఈ రుణాన్ని పొందారు.
Advertisement
స్టాండప్ ఇండియా పథకం ప్రయోజనాలు
స్టాండప్ ఇండియా పథకం ద్వారా మహిళలు తమ సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించానికి 85% వరకు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. గతంలో ఈ పథకం ద్వారా లబ్ది పొందటానికి దరఖాస్తు దారులు 25% వరకు తమ డబ్బును వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. ఇప్పడు యిది 10% నుండి 15% తగ్గించారు. ఇది చాల మంచి విషయం అని చెప్పవచ్చు. మీరు కేవలం 10% ఇన్వెస్ట్ పెడితే, కేంద్ర ప్రభుత్వం మిగతా డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంది.
అలాగే మీరు ఈ డబ్బు 18 నెలల వరకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని ఎటువంటి టెన్షన్ లేకుండా అభివృద్ధి చేస్తుకోవచ్చు. ముఖ్యంగా SC/ ST మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. అనగా మీరు ఏదైనా కంపెనీ మొదలు పెడితే 51 శాతం వరకు ఈ వర్గం మహిళలకు వాటా ఉండాలి.
ఈ పథకానికి అర్హులు ఎవరు?
స్టాండప్ ఇండియా ద్వారా మీ కంపెనీ లేదా ఏదైనా సంస్థ ను విస్తరించడానికి లోన్ తీసుకోవచ్చు. కానీ మీరు ఈ క్రిందని అర్హతలు కలిగి ఉండాలి.
- మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
- SC/ST మహిళలు అయి ఉండాలి.
- వ్యక్తిగతంగా కంపెనీ మొదలు పెట్టాలంటే, పైన చెప్పిన వర్గం మహిళలకు కంపెనీలో 51% వాటా ఉండాలి.
- ఇంతకుముంది బ్యాంకులో లోన్ తీసుకొని తిరిగి చెల్లించకుండా ఉందని వారు అర్హులు కాదు.
- మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి.
ఈ రుణాన్ని 7 సంవత్సరాలలో చెల్లించవచ్చు.
Standup India పథకానికి ఎలా దరఖాస్తు చెయ్యాలి?
మీరు స్టాండప్ ఇండియా పథకానికి దరఖాస్తు చేయడానికి మీరు స్టాండప్ మిత్ర అధికారిగా వెబ్సైటు సందర్సించాలి.
- మొదటిగా మీరు పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి స్టాండప్ మిత్ర వెబ్సైటు ఓపెన్ చేయండి.
- అక్కడ మీకు కనిపిస్తున్న “Apply for Loan” అనే బటన్ పైన క్లిక్ చేయండి.
- తర్వాత మీరు ప్రాధమిక వివరాలు పూరించి, మీ వ్యాపారాన్ని కూడా వివరించాల్సి ఉంటుంది.
- చివరిగా మీ వ్యాపార డాక్యుమెంటేషన్ అక్కడ అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
- తర్వాత వివరాలన్నీ మరొకసారి సరిచేసుకొని సబ్మిట్ చేయండి.
అలాగే మీ దరఖాస్తు కొంచెం స్పీడ్ అవ్వడానికి మీ దగ్గరలోని బ్యాంకు కి వెళ్లి ఇలా స్టాండప్ ఇండియా లోన్ కావాలి అని అడగండి. తద్వారా బ్యాంకు మేనేజర్ మీ వ్యాపార ప్లాన్ చూసి, మీకు లోన్ త్వరగా వచ్చే విధంగా చేస్తారు.
Advertisement