Farm Road: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా మీరు పొలానికి వెళ్ళడానికి ముందు ఉన్న పొలం వారు దారి ఇవ్వకపోతే ఏమి చెయ్యాలో తెలియజేస్తాము. కొన్ని కారణాలతో మీరు మీ వ్యవసాయ భూమి లోకి వెళ్ళడానికి న్యాయపరంగా అవకాశం ఉంది. ఆ కొన్ని కారణాలు ఏమిటో క్రింద ఇచ్చాము చుడండి.
Advertisement
- మీరు మీ పంట ఉత్పత్తులు నిర్వహించడం కోసం దారిని న్యాయపరంగా పొందవచ్చు.
- రెండవది మీరు మీ పంటను కోయడానికి కూడా దారి పొందవచ్చు.
- మూడవది, సాగు మరియు మరియు వ్యవసాయ కార్యకలాపాలకు మీరు దారిని చట్టబద్ధంగా పొందవచ్చు.
- మీరు ఫార్మ్ హౌస్ లేదా విలాసవంతమైన భవనం కట్టుకోవడానికి దారి అయితే ఇవ్వరు.
Table of Contents
దారిని ఎలా పొందవచ్చు?
మీరు పోలడానికి చట్టబద్ధంగా దారి పొందడానికి మీ సమీపంలోని తహసీల్దార్ ను కలిసి, సమస్యను వివరించాలి. తర్వాత రెండవ దశలో మీరు జిల్లా కలెక్టర్ గారికి సమస్య గురించి లెటర్ ద్వారా వివరించాలి. తద్వారా మీరు మీ పొలానికి దారి పొందే అవకాశాలు ఉంటాయి.
Advertisement
ఇక్కడ మీరు మొదటి దశలో భాగంగా తహసీల్దార్ ను కలవాల్సి ఉంటుంది.
భూ చట్టాలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక విధంగా ఉంటాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర లో కు దారి అవసరం అయితే మీరు తహసీల్దార్ ద్వారా పైన చెప్పిన విధంగా ప్రాసెస్ చెయ్యాలి. ఇక్కడ మీకు వ్యవసాయ పనులకు పనులకు మాత్రమే మీరు దారిని పొందగలుగుతారు. మీరు వ్యవసాయ సాగు కోసం అని తహసీల్దార్ కు తెలిసేలా చేస్తేనే, తహసిల్దార్ తన అధికారాలను ఉపయోగించి మీ ముందు ఉన్న పొలం వారికి దారి ఇవ్వమని ఆదేశాలు జారీ చేస్తారు.
అప్పుడు మీరు 8 అడుగుల దారి ఇవ్వమని మీ ముందు ఉన్న పొలం అతనికి ఆర్డర్స్ జారీ చేస్తారు. తద్వారా మీరు వ్యవసాయ పనులకు దారిని పాండవుతారు. ఈ 8 అడుగుల దారిలో మీకు ట్రాక్టర్ కూడా సులభంగా వెళ్తుంది.
Advertisement