SBI Personal Loan: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా స్టేట్ బ్యాంకు నుండి పర్సనల్ లోన్ తీసుకోవడం ఎలానో తెలియజేస్తాము. చాలా మందికి డబ్బుతో అవసరాలు ఉంటాయి, కొన్ని సార్లు అత్యవసరం కూడా ఉంటుంది. అంటే వివాహేతర మరియు ఇతర అవసరాలకు డబ్బు కోసం చాల చోట్ల అప్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా! బ్యాంకు నుండి కూడా మీరు ఋణం తీసుకోవచ్చు. ఎందుకంటే బయట అప్పుగా తీసుకున్న డబ్బుకు ఎక్కువ మొత్తంలో వడ్డీ కట్టవలసి ఉంటుంది.
Advertisement

అదే మీరు బ్యాంకు నుండి ఋణం తీసుకోవడం వలన మీరు వడ్డీ రేటు తగ్గించుకోవచ్చు. అలాగే మీరు అప్పు తీసుకోవడానికి వేరే వారి చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు.
Advertisement
Table of Contents
- SBI బ్యాంకు నుండి లోన్ తీసుకోడం వలన ఉపయోగాలేంటి?
- స్టేట్ బ్యాంకులో లోన్ తీసుకోవడవడానికి అర్హతలు
- కావాల్సిన పత్రాలు
- Processing Fee ఎంత?
- SBI నుండి పర్సనల్ లోన్ తీసుకోవడం ఎలా?
SBI బ్యాంకు నుండి లోన్ తీసుకోడం వలన ఉపయోగాలేంటి?
మీరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి పర్సనల్ లోన్ తీసుకోవడం వలన చాల లాభాలు పొందుతారు. మీరు రూ. 20 లక్షల వరకు ఋణం పొందవచ్చు. అలాగే మీరు చాల తక్కువ వడ్డీ రేటుతో పాటు, రోజువారి తగ్గింపు బాలన్స్ పైన మాత్రమే వడ్డీ పడుతుంది. తద్వారా మీరు వడ్డీ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కువ డాక్యూమెంట్లు ఏమి అవసరం లేకుండానే, తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో ఈ SBI పర్సనల్ లోన్ ప్రాసెస్ చేస్తారు.
స్టేట్ బ్యాంకులో లోన్ తీసుకోవడవడానికి అర్హతలు
State Bank of India నుండి పర్సనల్ లోన్ తీసుకోవడానికి మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- మీకు శాలరీ అకౌంట్ ఉండాలి.
- మీ వేతనం (salary) కనీసం రూ. 15 వేలు ఉండాలి.
- మీరు భారతదేశంలో ఎక్కడైనా పని చేస్తూ ఉండాలి. అనగా ప్రైవేట్, ప్రభుత్వ, ఎడ్యుకేషనల్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన కంపెనీలో పని చేస్తుండాలి.
- మీరు కనీసం ఒక సంవత్సరం నుండి ఏదైనా గుర్తింపు పొందైనా సంస్థ లో పని చేస్తూ ఉండాలి.
- లోన్ దరఖాస్తు దారునికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 58 సంవత్సరాలు ఉండాలి.
కావాల్సిన పత్రాలు
SBI నుండి పర్సనల్ లోన్ కోసం మీరు ఈ క్రింది పత్రాలు కలిగి ఉండాలి.
- ITR ఫైలింగ్ రిపోర్ట్ ఉండాలి.
- గత 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్
- శాలరీ స్లిప్
- ID ప్రూఫ్
- Address ప్రూఫ్
- 2 passport సైజు ఫోటోలు
Processing Fee ఎంత?
స్టేట్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు మీకు 1.5% వరకు ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది.
SBI నుండి పర్సనల్ లోన్ తీసుకోవడం ఎలా?
మిత్రులారా, మీరు స్టేట్ బ్యాంకు నుండి పర్సనల్ లోన్ తీసుకోవడానికి సులభంగా మీరు క్రింది ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

- మొదటిగా మీరు పైన ఇచ్చిన “Apply for SBI Personal Loan” బటన్ పైన క్లిక్ చేయండి.
- అక్కడ మీకు పైన ఇమేజ్ లో చూపిస్తున్న విధంగా స్టేట్ బ్యాంకు అధికారిక వెబ్సైటులో వివరాలు పూర్తిగా కనిపిస్తాయి. అక్కడ “Apply” అనే బటన్ పైన క్లిక్ చేయండి.
- తర్వాత మీరు sbiloansin59minutes.com అంటే సైట్ కు redirect అవుతారు. అక్కడ మీరు మీ ఎలిజిబిలిటీ వివరాలు మరియు ప్రాథమిక వివరాలు నమోదు చెయ్యాలి.
- అక్కడ మీరు ఎలిజిబిలి అయినా అమౌంట్ చూపిస్తుంది.
- అక్కడ చూపించిన అమౌంట్ లో మీకు కావాల్సిన అమౌంట్ ఎంపిక చేసుకొని లోన్ ప్రాసెస్ చేస్తే, మీకు 59 నిముషాల లోపు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతాయి.
Also read: SBI Account Holders: స్టేట్ బ్యాంకులో ఖాతా ఉన్నవారికి హెచ్చరిక!!!
Advertisement