SBI Account Holders: మిత్రులందరికీ నమస్కారం!! అందరికి, అన్ని చోట్ల అందుబాటులో ఉండే బ్యాంకు ఏదైనా ఉంది అంటే అది స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా. ఈ SBI బ్యాంకు నుండి ఇప్పుడు అందరికి ఒక నోటీసు వచ్చింది. ఈ కథనం ద్వారా ఆ నోటీసు గురించి తెలియజేస్తాము.
Advertisement

ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి బహుళ సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఉండి ఉంటాయి కదా! అంటే చాల మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కారణాలు ఏమైనప్పటికి ఒక్క బ్యాంకులోని ఖాతా ఉండేవారు తక్కువయిపోయారు. ఒక్క మనిషికి ఇలా ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాసరే, మొదటి బ్యాంకు ఖాతా మాత్రం 80% మంది స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లోనే ఖాతా తెరచి ఉంటారు. ఇంత ప్రసిద్ధి చెందిన బ్యాంకు అయినప్పటికీ, కస్టమర్లు పెరగడం వలనో లేదా మరి ఏదైనా కారణం చేతనో గాని స్టేట్ బ్యాంకు సర్వీసులు మిగతా బ్యాంకులతో పోలిస్తే నిదానం అయ్యాయి అని చెప్పడంలో సందేహం లేదు.
Advertisement
Table of Contents
SBI నుండి వచ్చిన నోటీసు ఏమిటి?
ఈ మధ్య కాలంలో చాల స్కాములు జరుగుతున్నాయి కదా! అలాగే స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పేరు వాడుకొని కొంత మంది మోసగాళ్లు మీకు బ్యాంకు నుండి మెసేజ్ చేసినట్లుగా మీరు మెసేజ్ చేస్తున్నారు. SBI లో ఖాతా ఉన్నవారికి ఇప్పటికే ఇలాంటి SMS లు చూసి ఉంటారు.
మీకు ఈ మెసేజ్ వస్తుంది అంటే “మీరు సంపాదించిన రివార్డ్ పాయింట్లు ఇంక 3 రోజులలో expire అయిపోతాయి. కావున క్రింద లింక్ లో ఇచ్చిన ఆప్ డౌన్లోడ్ చేసుకొని రివార్డ్ పాయింట్లకు వాడుకోండి -SBI” ఇలాంటి SMS లు మీరు చూసే ఉంటారు.
ఇలా మీరు ఆ ఆప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మీరు మీ బ్యాంకు ఖాతా అందులో లాగిన్ చేసిన వెంటనే మీ డబ్బు వాళ్ళ ఖాతాలకు బదిలీ అయిపోతుంది. ఇలాంటి మోసాల బారిన పడకండి.
ALERT: ఇలాంటి మెసేజిలు ఎప్పుడు వచ్చిన వాటిని పట్టించుకోకండి. లేదా వాటిని వెంటనే డిలీట్ చేసేయండి. ఇలాంటి మోసపూరిత మెసేజిలు నమ్మి మీరు మీ డబ్బు పోగొట్టుకోకండి అని నోటీసు ఇచ్చింది.
Also read: NTR Rythu Bharosa: రూ. 7500/- రైతు బ్యాంకు అకౌంట్లో జమ… మొదటి విడత..
Advertisement