Ration Distribution: మిత్రులందరికీ నమస్కారం!!! ఏపీలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏర్పాటు చేసింది. అయితే గత ప్రభుత్వంలో రేషన్ సరుకులు NDU వాహనాల ద్వారా పంపిణి చేసారు. కానీ ఈ వాహనాలు పేదవారికి అంతగా మేలు చేయలేదు అని అని కూటమి ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల రేషన్ సరుకులు పాత పద్దతిలో అనగా రేషన్ షాప్ కి వెళ్లి తీసుకొచ్చుకొనే పద్దతే తిరిగి ప్రారంభించారు.
Advertisement

అయితే చాల మంది ఇబ్బందులు పడినట్లు గమనించారు. అయితే కూటమి ప్రభుత్వం ఇలా ప్రజలు ఇబ్బంది పడకుండా మరో 4 వేలు రేషన్ షాపులు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రలో ఇప్పటికే 29,796 రేషన్ షాపులు ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ వాహనాలు కొనుగోలు చేయడానికి దాదాపుగా 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. కానీ ఇంటి ఇంటికి రేషన్ సరుకులు డెలివరీ అయితే ఇవ్వలేకపోయారు. అలాగే ఆ వాహనం ఎప్పుడు వస్తుందా అని ఎదుచూస్తూ కొంత మంది పేదలు కూలి పనికి వెళ్లకుండా ఉండేవారు.
Advertisement
ఇలా చాల మంది రేషన్ కార్డు దారులు ఇబ్బంది పడినట్లు గుర్తించారు. అయితే ఇక నుండి ఇలాంటి ఇబ్బందులు పడకుండా వారికి దగ్గరలో ఉండే రేషన్ షాప్ ద్వారా మీరు మీ సరుకులను పాత పద్దతిలో తీసుకోవచ్చని తెలిపారు. అయితే ఇప్పుడు రేషన్ షాపులు పెంచే నిర్ణయం కూడా తీసుకున్నారు కనుక, మీకు దగ్గరలోని రేషన్ షాపు ద్వారా మీరు సరుకు తీసుకొనే అవకాశం ఉంటుంది.
Also read: LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ రూ. 560/- లకే… కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం
కరోనా వంటి క్లిష్టమైన సమయాల్లో కూడా బియ్యం, కందిపప్పు వంటి వాటిని రేషన్ షాపుల ద్వారా మాత్రమే పంపిణి చేసారని తెలిపారు. అయితే ఏపీలో రేషన్ పంపిణీపై కూటమి తీసుకున్న నిర్ణయం పైన మీ కామెంట్స్ తెలుపండి.
Advertisement