Ration Card Changes: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన డాక్యుమెంట్ అయిన రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు గురించి తెలియజేస్తాము. సాధారణంగా రేషన్ కార్డు ఉంటె ప్రతి సంక్షేమ పథకాలు చాల సులభముగా పొందవచ్చు. అందులో వైట్ రేషన్ కార్డు దారులకు మరింత అవకాశాలు ఉంటాయి.
Advertisement

పెళ్ళైన వారు రేషన్ కార్డు ఎలా Split చేసుకోవాలి?
మిత్రులారా, సాధారణంగా పెళ్లయిన తర్వాత రేషన్ కార్డు split చేయడం వలన ప్రభుత్వం రెండు కుటుంబాలుగా పరిగణిస్తుంది. అంటే ఉదాహరణకి, మీ ఫాలిమిలిలో అమ్మ, నాన్న మరియు ఒక కుమారుడు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు కుమారుడికి పెళ్లి అయితే, వచ్చే ఇల్లాలు ఈ కుటుంబ రేషన్ కార్డులో ఆడ్ చేపించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతే కూడా ఆన్లైన్ లో బయోమెట్రిక్ ద్వారా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే సచివాలయం లో మీ పెళ్లి సర్టిఫికెట్ మరియు మీద ఆధార కార్డులు సబ్మిట్ చేసి, కుటుంబ రేషన్ కార్డుకు ఆడ్ అవ్వొచ్చు. అప్పుడు ఒకటే రేషన్ కార్డులో నాలుగు ఉంటారు.
Advertisement
కొత్తగా పెళ్లయిన భార్య, భర్తలు విడిగా ఇంకో రేషన్ ఎలా తీసుకోవాలంటే ఏమి చేయాలి? అనే డౌట్ చాల మందిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేయడకూడదు. ఎందుకంటే అప్పటికే మీరు ఒక రేషన్ కార్డులో ఉన్నారు. ఇప్పుడు మీరు రేషన్ splitting కొరకు దరఖాస్తు చెయ్యాలి. మీరు బయోమెట్రిక్ ఆధారంగా మీ సచివాలయం, లేదా మీ సేవ సెంటర్ కు వెళ్లి Ration Splitting కి application పెట్టాలి అనుకుంటున్నాం అంటే, వాళ్ళు మీకు ఒక ఫారం ఇచ్చి ఫిల్ చేయమని అంటారు. కంగారు పడకండి, అందులో మీ ప్రాథమిక వివరాలు అడుగుతారు. పూరించిన తర్వాత కావాల్సిన పత్రాలుఅనగా ఆధార కార్డు, పాత రేషన్ కార్డు మరియు మ్యారేజ్ సర్టిఫికెట్ ఫొటోస్టార్ట్ కాపీలు అటాచ్ చేసి ఇవ్వండి.
తర్వాత మీరు బయోమెట్రిక్ తీసుకుంటారు. అనగా మీ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని అర్ధం. ఇలా చేసిన 2 లేదా 3 వారాలలో మీకు కొత్త రేషన్ కార్డు ఇష్యూ అవుతుంది. అలాగే మీ పాత రేషన్ కార్డులో నుండి మీరు అనగా కొత్తగా పెళ్లి అయినా భార్య, భర్తల తీసివేయబడతారు.
Table of Contents
Note: మీ ప్రాసెస్ అంతే అన్ని రాష్ట్రాలలో ఇదే విదంగా ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్రాలలో మారవచ్చని గమనించాలి. ఇది మీరు జనరల్ సమాచారంగా తీసుకోవాలని ప్రార్ధన.
Also read: ప్రతి నెల రూ.3000/- మరియు ఉచిత భీమా… ఎలా అప్లై చెయ్యాలో ఇక్కడ చుడండి
Advertisement