PM Kisan Yojana: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా చాల మంది మంది ఎదురు చూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ యోజన డబ్బులు 2 వేల రూపాయలు ఎప్పడు వస్తాయా అనే కదా? కాబట్టి ఈరోజు కథనం ద్వారా 18వ విడతగా విడుదల చెయ్యాల్సిన రూ. 2000/- ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయాలు ఈ కథనం ద్వారా తెలియజేస్తాము.
Advertisement

ఇప్పటికే పీఎం కిసాన్ తరుపున 17వ విడతగా అందుకోవాల్సిన డబ్బును ఎన్నికలు అయి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 18వ తేదీన అందరి ఖాతాల్లో జమ చేసారని అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు అందరు రైతులు 18వ విడతగ విడుదల చెయ్యాల్సిన 2 వేల రూపాయల కోసం ఎదురుస్తున్నారు.
Advertisement
Table of Contents
- 18వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు?
- PM Kisan Yojana Payment Status ఎలా చూడాలి?
- PM Kisan Yojana eKYC చేయడం ఎలా?
- పీఎం కిసాన్ యోజన కోసం ఎలా రిజిస్టర్ అవ్వాలి?
18వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు?
మిత్రులారా!!! 18వ విడతగా విడుదల చెయ్యాల్సిన 2 వేల రూపాయలు వచ్చే నెల అనగా ఆగష్టులో రాఖీ పౌర్ణమి తర్వాత విడుదల చేయనున్నట్లు సమాచారం. కావు ఈ విడత కోసం ఎదురు చూసే ప్రతి రైతు ఇంకొన్ని రోజులు వేచి ఉండాలి.
PM Kisan Yojana Payment Status ఎలా చూడాలి?
పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ ను చాల సులభంగా మీ మొబైల్ నుండి చూడవచ్చు. మీరు ఇక్కడ క్రింద ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా స్టేటస్ తెలుసుకోచ్చు.

- ముందుగా మీరు PM Kisan అధికారిక (PM Kisan Know Your Status) వెబ్సైటు ఓపెన్ చెయ్యాలి.
- తర్వాత “Know Your Status” పైన క్లిక్ చెయ్యండి.
- అక్కడ మీ PM Kisan రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి, OTP సబ్మిట్ చేయండి
- తద్వారా మీరు PM Kisan Yojana Payment Status తెలుసుకోగలుగుతారు.
PM Kisan Yojana eKYC చేయడం ఎలా?
పీఎం కిసాన్ eKYC చేయడానికి మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంటి దగ్గరరే ఉంది మీ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. అది ఎలానోఇక్కడ చుడండి.

- ముందుగా మీరు PM Kisan అధికారిక (PM Kisan Yojana eKYC) వెబ్సైటు ఓపెన్ చెయ్యాలి.
- తర్వాత “eKYC” పైన క్లిక్ చెయ్యండి.
- అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి, OTP ద్వారా eKYC చేసుకోవచ్చు. (మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలని గమనించాలి)
పీఎం కిసాన్ యోజన కోసం ఎలా రిజిస్టర్ అవ్వాలి?
మీరు పీఎం కిసాన్ యోజన కోసం కొత్తగా రిజిస్టర్ అయి, ఇక నుండి మీరు కూడా ప్రతి విడత ద్వారా 2 వేల రూపాయలు ఆర్థిక సహాయం పొందడానికి ఈ క్రింద ఇచ్చిన దశలను అనుసరించండి.

- ముందుగా మీరు PM Kisan అధికారిక (New Farmer Registration Form) వెబ్సైటు ఓపెన్ చేయండి.
- “New Farmer Registration Form” పైన క్లిక్ చేయండి, తద్వారా మీకు ఫారం ఓపెన్ అవుతుంది.
- ఆ ఆన్లైన్ ఫారంలో మీరు “Rural Farmer Registration” లేదా “Urban Farmer Registration” లో ఒకటి ఎంపిక చెయ్యాలి.
- తర్వాత మీ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ రాష్ట్రం ఎంపిక చేసి capatcha సాల్వ్ చేసి OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయండి.
- తర్వాత దశలు అడిగిన బ్యాంకు వివరాలు, మీ పొలం వివరాలు మరియు ఇతర వివరాలు పూరించాలి.
- తద్వారా మీరు అర్హులైతే మీకు, తర్వాత విడుదల చేసే విడతల నుండి మీ బ్యాంకు ఖాతాలో కూడా డబ్బులు పడతాయి.
Advertisement