Nirudhyoga Bhruthi: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా మేము టీడీపీ ప్రభుత్వం ఇవ్వనున్న నిరుద్యోగ భృతి గురించి తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఏ ఉద్యోగం లేని వారికి ఇచ్చే ఆర్ధిక సహాయమే నిరుద్యోగ భృతి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం చేసిన ఈ హామీని అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిరుద్యోగ భృతిని పొందటానికి మీరు కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ పథకం యొక్క పూర్తి వివరాలు ఈ కథనంలో తెలియజేశాము.
Advertisement
నిరుద్యోగ భృతి ద్వారా నెలకు రూ. 3000/- సహాయం పొందడానికి మీరు కొన్ని అర్హతలు మరియు పత్రాలు కలిగి ఉండాలి. అలాగే మీ పేరు పైన EPF అకౌంట్ ఉండకూడదు. ఈ పథకం అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఈ పథకం ద్వారా దరఖాస్తులు స్వీకరించడానికి ఒక వెబ్సితెను కూడా రూపొందిస్తున్నారు.
Advertisement
Table of Contents
- నిరుద్యోగ భృతి పథకం ప్రయోజనాలు
- నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు ఎవరు?
- కావాల్సిన పత్రాలు
- How to Apply for Nirudhyoga Bhruthi?
నిరుద్యోగ భృతి పథకం ప్రయోజనాలు
నిరుద్యోగ భృతి ద్వారా పొందే ఈ సహాయంతో నిరుద్యోగులు కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే, ఏ ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యాలన్న కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రుసుము నిరుద్యోగులు వారి కుటుంబ సభ్యుల మీద ఆధార పడకుండ ఉండవచ్చు. కావున ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు మరియు కుటుంబస్తులకు కూడా ఆర్థిక పరంగాఉపశమనం లభిస్తుంది.
నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు ఎవరు?
మీరు డిగ్రీ లేదా గ్రాడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- మీరు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తూ ఉండాలి.
- గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- మీ పేరు పైన ఎటువంటి EPF అకౌంట్ ఉండకూడదు.
కావాల్సిన పత్రాలు
మీరు నిరుద్యోగ భృతి ద్వారా ఆర్ధిక సహాయాన్ని పొందడానికి మీరు ఈ క్రింది ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలి.
- రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- ఫోటో
ఇవి సాధారణంగా తీసుకునే పత్రాలు, ఈ పథకం అమలు అధికారికంగా ప్రకటించినప్పుడు ఇంకా ఏమైనా పత్రాలు కావాలంటే తెలియజేస్తాము.
How to Apply for Nirudhyoga Bhruthi?
Nirudhyoga Bhruthi కోసం దరఖాస్తు చెయ్యాలంటే మీరు ఆగష్టు రెండవ వారం వరకు వేచి ఉండాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా అడుగులు వేస్తోంది. అలాగే హామీ ఇచ్చిన అన్ని పథకాలు పూర్తి చేస్తుంది. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే పింఛను 4 వేల రూపాయలకు పెంచింది. అలాగే జులై 1వ తేదీన పెన్షన్ రూ. 7 వేలు ఇస్తాం అన్నారు, అలాగే జులై 1 వ తేదీన 7 వేళా రూపాయల పింఛను మొదటి రోజులోనే 95% పంపిణి పూర్తి చేసారు.
Advertisement