Indian Army Recruitment 2024: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనానికి స్వాగతం. ఈరోజు కథనం ద్వారా మనం ఇండియన్ ఆర్మీ నుండి విడుదలైన టెక్నీకల్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి వివరాలు తెలిజేస్తాము. బి.టెక్ పాస్ అయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పడంలో సందేహం లేదు. మిత్రులారా, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి, కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చెయ్యాలి? అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ పూర్తి కథనాన్ని చదవండి.
Advertisement

Indian Army Recruitment 2024
పోస్ట్ వివరాలు | SSC టెక్నికల్ ఆఫీసర్ (లెఫ్టినెంట్) |
మొత్తం ఖాళీలు | 381 |
జీతం | రూ. 56100- 177500/- నెలకు |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ | joinindianarmy.nic.in |
ఉద్యోగ స్థానం: మీరు ఉద్యోగం సాధించిన తర్వాత , భారతదేశంలోని ఆర్మీలో పోస్టింగ్ ఎక్కడైనా రావొచ్చు.
Advertisement
Indian Army Recruitment Notification PDF
ఇండియన్ ఆర్మీఉద్యోగ నోటిఫికేషన్ pdf క్రింద ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ | 16 జులై 2024 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చివరి తేదీ | 14 ఆగష్టు 2024 |
శిక్షణ ప్రారంభం | ఏప్రిల్ 2025 |
Eligibility Criteria for Indian Army Recruitment Notification
మిత్రులారా, ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు ఇక్కడ క్రింద ఇచ్చిన అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి
ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు కనిష్టంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 27 సంవత్సరాలు కలిగి ఉండాలి.
విద్యార్హతలు
- SSC (టెక్) పురుషులు, SSC (టెక్) మహిళలు మరియు SSCW Tech సంబంధిత రంగంలో BE/ B.Tech ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- SSCW నాన్-టెక్ పోస్టుకి దరఖాస్తు చేయడానికి ఉన్నత విద్యావంతుడు అయి ఉండాలి.
దరఖాస్తు రుసుము (Application Fee)
ఈ ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం (Selection Process)
- అప్లికేషన్ల Short list
- SSB
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది దశలను అనుసరించండి.

- మొదటిగా ఇండియన్ ఆర్మీ అధికారిగా వెబ్సైటు సందర్శించండి. (joinindianarmy.nic.in)
- తర్వాత 8ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ సెక్షన్ లోకి వెళ్లి “Apply Now” పైన క్లిక్ చేయండి.
- మీరు అంతకుముందే ఇండియన్ ఆర్మీ వెబ్సైటు లో రిజిస్టర్ అయి ఉంటె, లాగిన్ అవ్వండి. లేదా కొత్తగా రిజిస్టర్ అవ్వండి.
- ఆ తర్వాత అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లో అడిగిన వివరాలు పూరించండి. అలాగే అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి.
- చివరిగా “Submit” పైన క్లిక్ చేయండి.
Advertisement