Gold Jewellery: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా బంగారు నగలు పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెడతారో మీకు తెలియజేస్తాము. సాధారణంగా మన దేశంలో బంగారం మీద చాల మందికి మక్కువ ఎక్కువ ఉంటుంది.
Advertisement

అలాగే పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్లకు బంగారం మాత్రం ఉండాలని చాల మందికి ఒక నమ్మకం. ఇలాంటి బంగారం మనం దుఖాణాలకి వెళ్లి కొనేటప్పుడు లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయినా కళ్యాణ్ జెవెల్లరీ, లలిత జెవెల్లరీ మరియు ఇతర మాల్స్ లో బంగారు ఆభరణాలు పింక్ కలర్ ట్రే లేదా పేపర్ ఉంచి చూపిస్తారు.
Advertisement
అదే గ్రామాలలో అయితే బంగారు ఆభరణాలు, లేదా చిన్న చిన్న వస్తువులు కొన్నపుడు, వాటికి మనకు పింక్ కలర్ పేపర్ లో పెట్టి ఇస్తారు. చాల మంది ఈ పేపర్ బంగారు లేదా వెండి ఆభరణాలకు గీతాలు పడకుండా పెడతారు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే, బంగారు నగలు పింక్ కలర్ పేపర్ లో పెడితే తళుక్కుమని మెరుస్తాయి.
Advertisement