Free Sand Scheme: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజుటి కథనం ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక పథకం గురించి చెప్పబోతున్నాను. ఏపీలో ఇళ్ళు, అపార్టుమెంట్లు మరియు చాల రకాల కట్టడాలకు అవసరమయ్యే ఇసుక ఉచితంగా రావడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఇసుకను ఉచితంగా పొందడానికి ఏమి చెయ్యాలో ఈ కథనం ద్వారా వివరించాము. పూర్తిగా చదివి అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ కథనం ముఖ్య భాగంలోకి వెళ్దాం.
Advertisement
కొత్త మార్గదర్శకాలు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పేదలందరికీ ఉచిత ఇళ్ల నిర్మాణం.
Advertisement
గత ఐదు సంవత్సరాలుగా ఇసుక కోసం పడిన ఇబ్బందులు అందరికి తెలిసినవే. కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత కులం, మతం, వర్గం అనే తారతమ్యాలు లేకుండా ఇల్లు నిర్నచుకునే అందరికి ఇసుక ఉచితంగా ఇవ్వండి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేయడానికి అంత సిద్ధం.
How to Get Free Sand (ఉచిత ఇసుక ఎలా పొందాలి)
ఆంధ్రప్రదేశ్ లో తమ సొంత ఇల్లు నిర్మిచుకోవడానికి ఇసుకను ఉచితంగా పొందాలి అనుకుంటున్నారా? అయితే మీరు సరైన కథనాన్ని ఎంచుకున్నారు.
ఇక నుండి ప్రైవేట్ గ ఇసుక అమ్మకాలు జరుపకూడదు. ఎవరైనా ఇల్లు నిర్మించుకుంటూ ఇసుక కావాలనుకుంటే ఇసుక డిపో కు ట్రాక్టర్, లారీ లేదా ఎద్దుల బండి మీద వెళ్లి ఇసుకను ఉచితంగా తిసుక్కోచుకోవచ్చు. కానీ ఆ ఇసుకుంటే మీ వాహనం లోకి లోడ్ చేసినందుకు డబ్బులు ప్రజలు చెల్లించాలి.
ఉచితంగా ఇసుకకు డిపో నుండి మీ గ్రామానికి లేదా మీ గమ్యానికి తీసుకెళ్ళడానికి ఉన్నదా దూరాన్ని బట్టి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీ గ్రామంలో నిర్దేశించిన రూ.88 మరియు GST చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత ఇసుక పొందడానికి కావాల్సిన పత్రాలు
మీకు ఉచిత ఇసుక పొందాలనుకున్నపుడు మీరు మీ ఆధార్ కార్డు ఇసుక డిపో కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ మొబైల్ నెంబర్ ను ఇవ్వవలసి ఉంటుంది. ఒక వినియోగదారునికి అవసరాన్ని బట్టి రోజుకు 20 టన్నుల ఇసుకను మాత్రమె ఇస్తారు.
ఇప్పటికే డిపోల్లో 44.5 లక్షల టన్నుల ఇసుక రెడీ గా ఉంది.
Advertisement