Free House Land: మిత్రులందరికీ నమస్కారం!! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 2 నెలలు కావొస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పయనింస్తుంది.
Advertisement
గత ప్రభుత్వంలో పేదలకు ఇల్లు పథకం క్రింద 1.5 సెంట్లు స్థలం ఇచ్చింది, అలాగే కొన్ని చోట్ల ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేసింది. మరికొన్ని చోట్ల ప్రభుత్వమే ఇల్లు కట్టి అర్హులకు ఇచ్చింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన స్థలంలో ఇల్లు చాల ఇరుకుగా, అగ్గి పెట్టె లాగా ఉంది అని విమర్శలు వినిపించాయి. కనీసం పేదలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని కోరింది. అలాగే మేము (టీడీపీ) అధికారంలోకి వచ్చాక ఒక్కరికి 3 సెంట్లు ఇండ్ల స్థలం ఇష్టం అని హామీ ఇచ్చారు.
Advertisement
Table of Contents
ఎంత స్థలం ఇస్తారు?
చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు అర్హులైన పేద వారికి ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ప్రాంతాల వాసులకు 3 సెంట్లు మరియు పట్టాన ప్రాంతాల వారికి 2 సెంట్లు స్థలం ఇష్టం అని ప్రకటించారు.
అర్హులు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని పేదలకు స్థలం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రింది అర్హత ప్రమాణాలు కలిగిన వారికి స్థలం కేటాయిస్తారు.
- రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- రేషన్ కార్డులోని ఏ అభ్యర్థికి ఇంటి స్థలం ఉండకూడదు.
- ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తూ ఉండాలి.
- ఇంతకముందు ఇళ్ల స్థలం పొందిన వారు అనర్హులు.
కావాల్సిన పత్రాలు
మీరు ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేయడానికి ఈ క్రింది ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- మొబైల్ నెంబర్
ఎలా దరఖాస్తు చెయ్యాలి?
మీరు ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇచ్చే స్థలాన్ని పందానికి ఎలా దరఖాస్తు చెయ్యాలని చూస్తున్నారా? ప్రస్తుతానికి మీరు ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ గా దరఖాస్తు చేయడానికి ఆప్షన్ లేదు. ఈ పథకం ఎలా అమలు చెయ్యాలని చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది (VRO) చేత వెరిఫికేషన్ జరిపించి స్థలం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
AP జర్నలిస్టులకు శుభవార్త
అలాగే జర్నలిస్టులకు కూడా ఇంటి నిర్మాణంలో సహాయం చేస్తాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Advertisement