Advertisement

Crypto Currency: ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజి వాజిరాక్స్ నుండి 230$ మిలియన్ల చోరీ

Crypto Currency: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా జులై నెలలో దాదాపుగా $230 మిలియన్ చోరీ జరిగిన విషయం గురించి తెలుసుకుందాం. అయితే 16 మిలియన్ల వినియోగదారులను కలిగి వాజిరెక్స్ నుండి 230 మిలియన్ డాలర్ల డిజిటల్ ఆస్తులను హ్యాకర్లు మోసగించి వీరే క్రిప్టో వాల్లెట్లకు తరలించేసుకున్నారు. అయితే ఎన్ని సెక్యూరిటీ సిస్టములు మరియు ID వెరిఫికేషన్లు ఉన్న హ్యాకర్లు మాత్రం చాల మొత్తంలో చోరీ చేసారు.

Telegram Group Join

Advertisement

Crypto Currency wazirx

అలాగే ఈ చోరీకి పాలపడిన వారి వివరాలకు సంబంచి ట్రాక్ చేసి వివరాలు తెలిపి సహాయం చేసినవారికి $23 మిలియన్ డాలర్లు బహుమతిని కూడా ప్రకటించింది.

Advertisement

Table of Contents

వాజిరాక్స్ ఖాతాదారులు

మన దేశంలో ఎక్కువ ఉపయోగించే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజి నుండి ఇంత మొత్తంలో డబ్బులు చోరీ అయ్యేసరికి వాజిరాక్స్ ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.

WazirX Tweet about Hacking on X

WazirX అధికారిక “X” లో చేసిన ట్వీట్ మీరు క్రింద చూడవచ్చు.

WazirX CEO Nischal Shetty

ఈ దొంగతనం ద్వారా ఎక్స్చేంజి దాదాపు 45% క్రిప్టో ఆస్తులను కోల్పోయినట్లు తెలుస్తుంది. అలాగే WazirX CEO నిశ్చల్ శెట్టి గత వారం ఇంటర్వ్యూ ద్వారా చాల మద్దతు కోసం చాల గ్లోబల్ ఎక్స్చేంజి లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. WazirX ఎక్స్చేంజి ఇప్పటికే అన్ని లావాదేవీలను CERT-in మరియు FIU-IND(Financial Intelligence Unit – India కు సమర్పించి, నిరంతరం వారితో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

పాత పార్టనర్ అయినా Binanace ఎక్స్చేంజి మరియు WazirX కూడా ప్రస్తుతానికి న్యాయపోరాటంలో ఉన్నాయి.

Crypto Currency Transactions ట్రాక్ చేయవచ్చా?

Crypto Currency లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు కానీ కొంత వరకు మాత్రమే చేయలేము. ఉదాహరణకు మనకు బ్యాంకు ఖాతాలో అకౌంట్ నెంబర్ ఉన్నట్లుగానే, ప్రతి క్రిప్టో కరెన్సీ కాయిన్ కి, ప్రతి వాలెట్ కు ఒక ప్రత్యేక unique అడ్రెస్స్ ఉంటుంది. ఇలా ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ (లావాదేవీ) చేసేటప్పుడు ఈ అడ్రస్ మాత్రమే ఉపయోగిస్తారు. పేరు, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటివి ఏమి ట్రాక్ అవ్వవు. అదే మన బ్యాంకు అకౌంట్ నుండి చేసినప్పుడు ఇవన్నీ ట్రాక్ అవుతాయి. అందుకే ఈ క్రిప్టో కరెన్సీని డిసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటారు.

Also read: BSNL SIM వినియోగదారులకు మరొక శుభవార్త!!

ఈ క్రిప్టో కరెన్సీ ట్రాక్ చేయడం అంత సులభమైన పద్దతి అయితే కాదు అంటే చాలా క్రిప్టో వినియోగదారులకు, మరియు ట్రేడర్లకు తెలిసేవుంటుంది. ఈ లావాదేవీలు అన్ని కూడా ఒక బ్లాక్ చైన్ ద్వారా జరుగుతాయి. కానీ ప్రయత్నం చేయకుండా వదలకూడదు కదా! దేశ వ్యాప్తంగా ఇంత $230 మిల్లియన్ల (2000 కోట్ల రూపాయలు) డబ్బును చోరీ చేయడం అంటే చాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment