Chandranna Kanuka: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాతసరికొత్త రేషన్ కార్డులు మరియు గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న పండుగ కానుకలు గురించి తెలియజేస్తాము. గతంలో (2014-19) టీడీపీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి పండుగకి ఇంట్లో వస్తువులు ఉండాలనే ఉదేశంతో చంద్రబాబు ప్రభుత్వం సంక్రాంతి. క్రిస్మస్ మరియు రంజాన్ తోఫా వంటి వాటిని ఇచ్చేవారు. అయితే గత ప్రభుత్వం వైస్సార్సీపీ ఈ పండుగ కానుకలు నిలిపివేసింది తెలిపారు.
Advertisement
అయితే ఇక నుండి పండుగలకు చంద్రన్న కానుకలు ఇవ్వడానికి కసరత్తు జరుగుతుంది.
Advertisement
Table of Contents
- ఏ ఏ పండుగలకు చంద్రన్న కానుకలు ఇస్తారు?
- కొత్త రేషన్ రేషన్ కార్డులు
- కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు?
- రేషన్ కార్డులు ఎవరికీ తొలగిస్తారు?
ఏ ఏ పండుగలకు చంద్రన్న కానుకలు ఇస్తారు?
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి, క్రిస్మస్ మరియు రంజాన్ పండుగలకు కానుకలు ఇవ్వడానికి చంద్రన్న ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. అయితే చంద్రన్న కానుకలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ. 530 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే సంవత్సరానికి ఇన్ని కోట్లు భారం పడిన పేదలకు మంచి చెయ్యాలని, పండుగకు ఎవరు బాధ ప్రదకూడదని కూటమి ప్రభుత్వం ఈ పండుగ కానుకలు ఇవ్వడానికి సిద్దము అయింది.
కొత్త రేషన్ రేషన్ కార్డులు
ఏపీలో గత ప్రభుత్వం వైస్సార్సీపీ పేదలకు ఇచ్చే రేషన్ కార్డుల పైన తమ పార్టీ జెండా రంగులు మరియు YS రాజేశేఖర రెడ్డి గారి ఫోటో ఉన్న కారణంగా అందరికి మళ్ళి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. పేదలకు ఇచ్చే రేషన్ కార్డు పైన రాజకీయ పార్టీ జెండా గుర్తు ఉండటం ఏమిటి అని మండి పడ్డారు.
అయితే ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. కొత్త రేషన్ కార్డుల డిజైన్ పూర్తి అవగానే ఏపీలో అందరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు.
కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇంతకముందు వేరే ప్రభుత్వం ఉండటం వలన కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటిని సరిచేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని కూటమి ప్రభుత్వం తెలిపింది.
అయితే ఇటీవల జరిగిన కార్యక్రమంలో పౌరశాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. వాటి విధి విధానాల పైన స్పష్టత రాగానే రేషన్ కార్డులు జారీ చేస్తాము అని తెలిపారు.
రేషన్ కార్డులు ఎవరికీ తొలగిస్తారు?
కాలానుగుణంగా రేషన్ కార్డులు పేదలకు ఆహార భద్రత చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఉన్న 90 లక్షల రేషన్ కార్డులో 1.36 లక్షల మంది గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని తెలిపారు. అయితే వారి రేషన్ కార్డులు తొలగించి, రేషన్ కార్డులకు అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు ఇచ్చే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి.
తద్వారా అరహతా కలిగిన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు ఉంటుంది. మరియు ప్రభుత్వానికి రూ. 80 కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు.
Advertisement