August 15 AP Schemes: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్య్ర దినోత్త్సవం నుండి ప్రారంభించే పథకాల గురించి తెలియజేస్తాము.
Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికే రెండు నెలలు పూర్తి అవుతుంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఆగష్టు 15వ తేదీ నుండి అనగ స్వాతంత్య్ర దినోత్త్సవం నుండి మూడు పథకాలను ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అన్న కాంటీన్ పనులు పూర్తి అయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. తల్లికి వందనం కూడా ఆగష్టు 15 నుండి ప్రారంభిస్తారా లేదా అని చూడాలి.
Advertisement
Table of Contents
- అన్న కాంటీన్ ఎప్పుడు ప్రారంభిస్తారు?
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
- తల్లికి వందనం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
అన్న కాంటీన్ ఎప్పుడు ప్రారంభిస్తారు?
గత ప్రభుత్వంలో మూత పడిన అన్న కాంటీన్లు, మళ్ళి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరవడానికి సిద్ధం చేసారు. పాత అన్నా కాంటీన్లు మరమ్మత్తులు చేయడమే కాకుండా, కొన్ని కొత్త అన్న కాంటీన్లు కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్త్సవం రోజున అన్న కాంటీన్లు ప్రారంభించనున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ లో కుటం ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించనున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదటిగా విశాఖపట్నం లో ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇలా ఉచిత బస్సు ప్రయాణం వలన ప్రభుత్వానికి నెలకు రూ. 250 కోట్లు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణ లో పరిస్థితి దృష్ట్యా ఈ అంచనా వేశారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డు లేదా కర్నటక లో ఇచ్చినట్లు మహాలక్షి కార్డు ఇస్తారా అనేది చూడాలి.
Free Bus Details: Free Bus: వీరికి కూడా APSRTC ఉచిత బస్సు ప్రయాణం
తల్లికి వందనం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఏపీలో గత ప్రభుత్వం అమ్మ వొడి ఇచ్చినట్లు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అమ్మ వొడి కి బదులుగా తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఉండే ప్రతి పిల్లవానికి రూ. 15 వేలు చొప్పున ఎంత మంచి పిల్లలు ఉంటె అంత మందికి ఇస్తాము అని హామీ ఇచ్చారు. కానీ ఈ పథకం పైన ఇంకా స్పష్టత వచ్చినట్లు కనిపించడం లేదు. కానీ కొంతమంది తల్లికి వందనం కూడా ఆగష్టు 15వ తేదీ నుండి అమలు చేస్తారు అని అంటున్నారు. కానీ తల్లికి వందనం పైన స్పష్టత కోసం కొంత సమయం వేచి ఉండాలి.
Also read: Inspire Award: కేంద్రం నుండి ఒక్కో విద్యార్థికి రూ. 10 వేలు… బంపర్ ఆఫర్
Advertisement