AP Distrtict Court Jobs: మిత్రులందరికీ నమస్కారం!! ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. ప్రకాశం జిల్లా కోర్టులో ఔట్సోర్సింగ్ బేసిస్ మీద ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబ్బోర్డినేట్ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న 7వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఆగష్టు 1వ తేదీ నుండి ఆగష్టు 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు offline లో దరఖాస్తు చేసుకోవాలని అధికారిక నోటిఫికేషన్ PDF ద్వారా తెలియాజేశారు.
Advertisement

Table of Contents
- AP Distrtict Court Jobs Notification
- విద్యార్హతలు
- ప్రకాశం జిల్లా కోర్టు ఉద్యోగాలకు కావాల్సిన వయోపరిమితి
- దరఖాస్తు చేయడానికి కావాల్సిన పత్రాలు
- ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
AP Distrtict Court Jobs Notification
- మొత్తం ఖాళీలు: 04
- పోస్టులు: ఆఫీసర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబ్బోర్డినేట్
- దరఖాస్తు విధానం: offline ద్వారా దరఖాస్తు చెయ్యాలి.
- వేతనం:
- ఆఫీస్ అసిస్టెంట్: నెలకు రూ. 18,500/- ఇస్తారు.
- ఆఫీస్ సబ్బోర్డినేట్: నెలకు రూ. 15,000/- ఇస్తారు.

విద్యార్హతలు
అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లో ఆఫీసర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబ్బోర్డినేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన బోర్డు ద్వారా 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Advertisement
ప్రకాశం జిల్లా కోర్టు ఉద్యోగాలకు కావాల్సిన వయోపరిమితి
ప్రకాశం జిల్లాలో విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు కనిష్టంగా 18 సంవత్సరాలు కలిగి ఉండాలి అలాగే గరిష్టంగా 42 సంవత్సరాలు కలిగి ఉండాలి.
వయస్సు సడలింపు
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు చేయడానికి కావాల్సిన పత్రాలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలి.
- మీ విద్యార్హతకు సంబందించిన పత్రాలు
- పుట్టిన తేదీని ధృవీకరించే ధృవీకరణ పత్రం.
- కుల ధ్రువీకరణ పత్రము
- స్వీయ-చిరునామా కవరు, విధిగా రూ. 30/- రిజిస్టర్డ్ పోస్ట్ కోసం రసీదు చెల్లించాల్సి ఉంటుంది, దరఖాస్తుతో జతచేయాలి.
- దరఖాస్తుదారు యొక్క ఇటీవలి రెండు పాస్‌పోర్ట్-పరిమాణ రంగు ఛాయాచిత్రాలు.
- ఒక ఛాయాచిత్రం దరఖాస్తు యొక్క కుడి ఎగువ మూలలో నిర్ణీత స్థలంలో అతికించబడాలి మరియు గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడాలి.
- రెండవ ఛాయాచిత్రం వేరు చేయగలిగినదిగా ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
పైన ఇచ్చిన దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి. తర్వాత పైన చెప్పిన విదంగా పత్రాలను అటాచ్ చేసి దరఖాస్తు ఫారంలో అన్ని వివరాలు సరిగ్గా పూరించండి. పూరించిన దరఖాస్తు ఫారం మరియు పైన చెప్పిన పత్రాలు అన్ని క్రింద ఇచ్చిన చిరునామాకు ఆగష్టు 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తు స్వీయకరించబడవు అని అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు.
చిరునామా:
ఛైర్మన్-కమ్- ప్రిన్సిపాల్ జిల్లా న్యాయమూర్తి, జిల్లా లీగర్ సర్వీస్ కోర్టు అథారిటీ, కోర్టు కాంప్లెక్స్ ఆఫీస్, ఒంగోలు
Also read: AP Open School 10వ తరగతి & ఇంటర్మీడియట్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి
Advertisement