AP Open School: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా మీరు ఎవరైతే వారి చదువు మధ్యలో ఆపేసి, మళ్ళి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా రోజు స్కూలు, కాలేజీలకు వెళ్లకుండా 10వ తరగతి మరియు ఇంటర్ పూర్తి చేయొచ్చు. ఎవరైతే వారి చదువును మధ్యలో ఆపేశారో వారికి ఇదొక మంచి అవకాశం. మీరు ఓపెన్ స్కూల్ ద్వారా పూర్తి చేసిన 10వ తరగతి మరియు ఇంటర్ కు మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు ఒకే విధమైన వేల్యూ ఉంటుంది.
Advertisement
Table of Contents
- ఇంటర్ ఏ ఏ గ్రూపులు ఉంటాయి?
- ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ చదవడానికి అర్హత
- ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు రుసుము
- ఎలా దరఖాస్తు చెయ్యాలి?
ఇంటర్ ఏ ఏ గ్రూపులు ఉంటాయి?
మీరు 10వ తరగతి పూర్తి చేసి, ఇంటర్ మాత్రం ఓపెన్ స్కూల్ ద్వారా చదవొచ్చు. అయితే ఓపెన్ ఇంటర్ లో కూడా సాధారణ రెగ్యులర్ ఇంటర్ లానే ఎంపీసీ, బైపీసీ, MEC, HEC, CEC, MBiPC వంటి గ్రూపులు ఉంటాయి.
Advertisement
ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ చదవడానికి అర్హత
ఓపెన్ స్కూల్ ద్వారా మీరు ఇంటర్ చదవడానికి మీరు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే మీరు ఇంటర్ మధ్యలో మానేసి ఉన్న ఓపెన్ స్కూల్ ద్వారా మరల ఇంటర్ పూర్తి చేయొచ్చు. అలాగే మీ వయస్సు కనీసం 15 సంవత్సరాలు మించి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
ఓపెన్ స్కూల్ ద్వారా మీరు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ చదవడానికి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 31 జులై 2024 తేదీ నుండి 27 ఆగష్టు 2024 వరకు అందుబాటులో ఉంటుంది.
మీరు ఏదైనా కారణం చేత ఆలస్యం అయితే అదనంగా 200 రూపాయలు రుసుము చెల్లించి 4 సెప్టెంబర్ 2024 లోపు ధరఖాస్తుకి చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
ఓపెన్ స్కూల్ ద్వారా మీరు చదవడానికి రూ. 200/- రుసుము చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చెయ్యాలి?
ఓపెన్ స్కూల్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోడానికి క్రింద ఇచ్చిన వెబ్సైటు సందర్సించాలి.
https://aposs.aptonline.in/APOSSAMARAVATI/UI/StudentForms/CandidateHomePage.aspx
- మొదటిగా పైన ఉన్న లింక్ క్లిక్ చేయండి.
- అక్కడ “Registration Form” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
- మీరు అక్కడ 10వ తరగతి లేదా ఇంటర్ ఎంపిక చేసుకోవాలి. అంటే మీరు ఏం చదవడానికి దరఖాస్తు చేస్తున్నారో, అది ఎంపిక చేసుకోండి.
- అలాగే అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, జెండర్ మరియు తండ్రి పేరు నమోదు చేయండి.
- తర్వాత “Confirm Details” పైన క్లిక్ చేసి మిగతా వివరాలు పూరించడండి.
- ఇలా మీరు వివరాలు పూరించిన తర్వాత, దరఖాస్తు రుసుము చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయండి.
Also read: 10వ తరగతి అర్హతతో పవర్ కార్పొరేషన్ నుండి 279 ఉద్యోగాలు… ఇలా అప్లై చేయండి
Advertisement