Ration Cards: మిత్రులందరికీ నమస్కారం!! మా కొత్త కథనానికి స్వాగతం. ఈరోజు కథనంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల వివరాలు తెలియజేస్తాము. ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలనలో ఉంచింది. అయితే త్వరలో అందరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు.
Advertisement

గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులకు వారి పార్టీ జెండా రంగులు మరియు వైస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో వేశారు. రేషన్ కార్డు ప్రభుత్వం ఇచ్చేది కానీ, పార్టీ ఇచ్చేది కాదు అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కసరత్తులు చేస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డుల డిజైన్లు ఎలా ఉన్నాయి అని ఇంకా స్పష్టత రావాలి ఉంది.
Advertisement
అయితే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు మరియు కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చే కొత్త రేషన్ కార్డుల డిజైన్లు పూర్తి అయినా తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అని తెలిపారు. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం కష్టాలు ఎక్కువ పడాల్సిన అవసరం లేదు అని తెలిపారు.

అలాగే 2014-19 లో రేషన్ షాపుల ద్వారా బియ్యం కాకుండా ఇచ్చిన మిగతా సరుకులు కూడా గత ప్రభుత్వం ఆపేసింది ఆరోపించారు. అయితే ఇప్పటి నుండి పేదలకు తక్కువ ధరల్లోని బియ్యంతో పాటు మిగతా పలు రకాల వస్తువులు తక్కువ ధరకి అందిస్తాం అని తెలిపారు. అలాగే పండగలకు కూడా ఉచిత సరుకులు ఇస్తాం అని తెలిపారు. ఇకపై పండగలకు చంద్రన్న కానుకలు మళ్ళి మొదలు పెడతాం అని తెలిపారు.
కావాల్సిన పత్రాలు
ఆంధప్రదేశ్ లో మీరు కొత్త రేషన్ కోసం దరఖాస్తు చేయడానికి ఈ క్రింది పత్రాలు అవసరం ఉంటుంది.
- గుర్తింపు రుజువు పత్రం (ఆధార్ కార్డు)
- కుల ధ్రువీకరణ పత్రము
- ఆదాయ దృవీకరణ పత్రము
- కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు కాపీలు
Also read: రేషన్ కార్డు ఉన్నవారు ఈ 3 కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందకపోతే ఇలా చేయండి
Advertisement