Farmer Subsidy: మిత్రులందరికీ నమస్కారం!!! ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్కుంటూ వస్తుంది. అయితే రైతులకు రాయితీ ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సీఎం చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎక్కువగా సూక్ష్మ సేద్య ప్రాధాన్యత ఇస్తారు. గతంలో అనగా 2014 నుండి 2019 మధ్య పాలనలో రైతులుకు టీడీపీ ప్రభుత్వం ఎక్కువగా సూక్ష్మ సేద్య పథకానికి ప్రాధాన్యత ఇవ్వడం మనం గమినించాము.
Advertisement

కంపెనీలతో మాట్లాడి రైతులకు తక్కువ ధరకు అవసరమైన పరికలను అందించడమే కాకుండా రాయితీ పొందేలా చేస్తున్నారు. ఈ రాయితీ దాదాపు రూ. 3 లక్షల వరకు పొందవచ్చు. మొత్తంగా రైతులకు రాయితీ కింద రూ. 11.17 కోట్ల రూపాయల అందించనున్నారు.
Advertisement
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2,400 హెక్టార్లలో ఈ పథకం అమలు చేయడానికి సిద్ధం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలు ఎక్కువగా నష్టపోకుండా ఉన్నడటానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే యువతకు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను పెంపొందించి వారిని కూడా వ్యవసాయం చేసే దిశగా ప్రోత్సాహిస్తున్నారు. రైతన్నలు ఎక్కువగా వర్షాలు, వరదలు కారణంగా చాల సార్లు నష్టాలను చవి చూస్తుంటారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో మేలు చేయడానికి ఇటువంటి పథకాలను ప్రవేశపెడుతున్నారు.
రైతన్నలకు రాయితీ కింద రూ. 11.17 కోట్లను ఇస్తున్నారు. కేంద్రప్రభుత్వం 60% వరకు భరిస్తే, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిరప, కొబ్బరి, మామిడి, జామ, ఆయిల్ ఫార్మ్, కూరగాయలు ఇలాంటి పంటలు వేసే చిన్నకారు రైతులకు దాదాపు 90% రాయితీ తో రూ. 2.18 లక్షలు అందించనున్నారు.
Advertisement