Annadaatha Sukhibhava Scheme: మిత్రులందరికీ నమస్కారం!!! ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినా తర్వాత సూపర్ 6 లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆగష్టు 15వ తేదీ నుండి పిల్లల కోసం తల్లికి వందనం, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం మరియు అన్న కాంటీన్లు త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు. అన్న కేటీన్లు ఇప్పటికే పూర్తి చేసారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా విశాకహాపట్నంలో ఆగష్టు 15న ప్రారంభించునున్నట్లు సమాచారం.
Advertisement
Table of Contents
- అన్నదాత సుఖీభవ పథకం
- రైతులు ఎలా లబ్ది పొందుతారు?
- Annadaatha Sukhibhava పథకానికి అర్హులు ఎవరు?
- కావాల్సిన పత్రాలు
- అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా దరఖాస్తు చెయ్యాలి?
అన్నదాత సుఖీభవ పథకం
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలలో అన్నదాత సుఖీభవ కూడా ఒకటి. ఈ అన్నదాత సుఖీభవ కూడా 2019 తెలుగుదేశం పార్టీ అమలులో ఉన్నపుడు కూడా ఉండేది. అప్పట్లో కూడా అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం చేసారు. అలాగే ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ.20,000/- ఆర్థిక సహాయం చేస్తుంది.
Advertisement
గత వైస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని వైస్సార్ రైతు భరోసాగా పేరు మార్చి విజయవంతంగా అమలు చేసారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలులోకి రావడంతో మరల తిరిగి ఇది అన్నదాత సుఖీభవ గా మారింది.
రైతులు ఎలా లబ్ది పొందుతారు?
మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ మీకు భూమి ఉన్న లేదా కౌలు వ్యవ్యసాయం చేసిన మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు రూ. 20,000/- లబ్ది పొందుతారు. ఈ పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అనుసంధానించి ఉంటుంది. అంటే పీఎం కిసాన్ యోజన ద్వారా మీరు రూ.6,000/- లు పొందుతారు. మిగతా డబ్బులు రూ. 14,000/- రాష్ట్ర ప్రభుత్వ ద్వారా అన్నదాత సుఖీభవ పేరుతో విడుదల చేస్తారు.
Annadaatha Sukhibhava పథకానికి అర్హులు ఎవరు?
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హలు అవడానికి మీరు ఈ క్రింది ఇచ్చిన అరహతా ప్రమాణాలు కలిగి ఉండాలి.
- మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
- మీకు భూమి ఉండాలి లేదా కౌలుకి వ్యవసాయం అయినా చేస్తుండాలి.
- పీఎం కిసాన్ యోజన పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులే.
కావాల్సిన పత్రాలు
మీరు అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేయడనికి మీరు ఈ క్రింది ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలి.
- గుర్తింపు రుజువు పత్రము
- ఆధార్ కార్డు
- భూమి పత్రాలు
- నివాస ధ్రువీకరణ పత్రము
- బ్యాంకు అకౌంట్ నెంబర్
- మొబైల్ నెంబర్
అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా దరఖాస్తు చెయ్యాలి?
Annadaatha Sukhibhava పథకం నారా చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేయడనికి కొత్త పోర్టల్ ఒకటి తాయారు చేస్తున్నారు. కావు ప్రతి రైతు ఆ పోర్టల్ విడుదల చేసేవరకు వేచి ఉండాలి. సాధారణంగా ఆ పోర్టల్ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఈ క్రింది విదంగా ఉంటుంది.
- మొదటిగా మీరు Annadaatha Sukhibhava Scheme అధికారిక వెబ్సైటు సందర్శించండి.
- అక్కడ మీ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ నమోదు చేసి, OTP ద్వారా వెరిఫికేషన్ చెయ్యాలి.
- అలా చేసిన తర్వాత, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ గెనెరతె అవుతుంది.
- ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపగయోగించి లాగిన్ అయి, మీ వివరాలు మరియు పైన చెప్పిన పత్రాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
- Congrats!!! మీరు విజయవంతంగా అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసారు.
Also read: August 15: స్వాతంత్య్ర దినోత్త్సవం రోజున ప్రారంభమయ్యే పథకాలు ఇవే…
Advertisement