Adhaar Update: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి ఉచితంగా పెట్టె క్యాంపుల వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది భారతదేశంలో ప్రతి మనిషికి గుర్తింపు పత్రము. ఈ కార్డు కార్డు ద్వారా ఒక మనిషి ఎవరు? ఎక్కడ నివసిస్తున్నారు? వారి పుట్టిన తేదీ వంటి ఎన్నో వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలలో ఏ పని జరగడానికి అయినా ఆధార్ కార్డు అనేది ఒక ముఖ్యమైన కార్డు. అలంటి కార్డు మీరు కొన్ని సందర్భాలలో అప్డేట్ చేసుకోవాలి. లేదంటే బయోమెట్రిక్ మరియు ఫింగెర్ప్రింట్ సరిగ్గా పని చేయవు.
Advertisement

Table of Contents
- ఆధార్ ఏ ఏ సందర్భాలలో అప్డేట్ చేయించుకోవాలి?
- ఒకటి కన్నా ఎక్కువ సార్లు అప్డేట్ చేయలేనివి?
- ఉచితం ఆధార్ కార్డు కాంపుల వివరాలు
ఆధార్ ఏ ఏ సందర్భాలలో అప్డేట్ చేయించుకోవాలి?
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఉండేది ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు కన్ను, చేయి అన్ని వేళ్ళు ఫింగెర్ప్రింట్ మరియు ఒక మొబైల్ నెంబర్ ద్వారా తయారు చేయబడుతుంది. ప్రతి మనిషికి కన్ను మరియు చేతి వేళ్ళ బయోమెట్రిక్ చాల బిన్నంగా ఉంటుంది. అయితే ఈ భిన్నమైన గుర్తుల ద్వారా ఈ కార్డులు వేరు చేయబడతాయి. ప్రతి కార్డుకు ఒక ప్రత్యేక నెంబర్ ఉంటుంది.
Advertisement
అయితే ఏ ఏ సందర్భాలలో కార్డు అప్డేట్ చెయ్యాలో క్రింద చూడండి
- 5 సంవత్సరాలు దాటినా పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చెయ్యాలి. ఎందుకంటే చిన్న పిల్లలకు ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు వారి సంరక్షకుల ఆధార్ నెంబర్ ద్వారా generate చేస్తారు.
- ఆధార్ కార్డులో అడ్రస్ 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేయించుకోవాలి. అయితే మీరు అదే అడ్రస్ లో ఉంటున్న సరే 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవడం ద్వారా మీ కార్డు చాల చురుకుగా పనిచేస్తుంది.
ఒకటి కన్నా ఎక్కువ సార్లు అప్డేట్ చేయలేనివి?
మీరు ఆధార్ కార్డు ఒకసారి సృష్టించిన తర్వాత అందులో మార్పులు ఎక్కువ చేయలేము. మీరు అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ ఎన్ని సార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. అనగా అందులో మార్పులు చేయొచ్చు. పుట్టిన తేదీ మీరు ఒక్కసారి మాత్రమే మార్పులు చేసుకోగలరు.
ఉచితం ఆధార్ కార్డు కాంపుల వివరాలు
ఈ ఉచిత ఆధార్ క్యాంపుల ద్వారా మీ ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు సచివాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు, అంగన్వాడీ సెంటర్లలో ప్రభుత్వం ఆధార్ క్యాంపులను నిర్వహించనుంది. ఇక్కడ కొత్తగా ఆధార్ కార్డు నమోదు, ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్, పేరులో ఏదైనా పొరపాటు, మొబైల్ నెంబర్ ఇలాంటివి ఉచితంగా అప్డేట్ చేస్తారు.
Advertisement